Breaking News

'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

Published on Wed, 01/24/2024 - 13:18

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్‍ ఆఫ్‍ డల్లాస్‍ 'టీ-పాడ్'  నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్‌లోని  ఇర్వింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్‌ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. 

టీ-పాడ్ 2024 అధ్యక్షురాలిగా కన్నయ్యగారి రూప, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకిరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బుచ్చి రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు.

టీ-పాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు. టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు  వివరించారు.

తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం.. బతుకమ్మ, దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్‌లో నిర్వహించడం గురించి వివరించారు.  చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)