Breaking News

'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

Published on Wed, 01/24/2024 - 10:35

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్‍ ఆఫ్‍ డల్లాస్‍ 'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్‌ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

టీ-పాడ్ 2024 అధ్యక్షురాలిగా కన్నయ్యగారి రూప, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకిరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బుచ్చి రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు. టీ-పాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు.

టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివరించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం.. బతుకమ్మ, దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్‌లో నిర్వహించడం గురించి వివరించారు. చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు.

(చదవండి: న్యూయార్క్ టైమ్స్‌ స్వ్కేర్‌ రామ మయం)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)