Breaking News

సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకుని తెలంగాణ వాసి మృతి

Published on Sun, 08/25/2024 - 09:37

ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ యువకుడు మృతి చెందాడు. సౌదీ అరేబియాలోని రబ్‌ అల్‌ ఖలీ అనే ఎడారిలో చిక్కుకుని 27 ఏళ్ల షెహజాద్‌ ఖాన్‌ అనే వ్యక్తి మృతి చెందాడు.  ఆ ఎడారిలో దారితప్పి..ఎటు వెళ్లాలో తెలియక.. మరోవైపు తాగేందుకు నీరు, తినేందుకు ఆహరం లేక ఐదు రోజులుపాటు నరకయాతన అనుభవించి అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు. 

వివరాల్లోకెళ్తే..కరీంనగర్‌కి చెంఇన 27 ఏళ్ల షెహజాద్‌ ఖాన్‌ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్‌ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్‌ సక్రమంగా పనిచేయలేదు.

జీపీఎస్‌ పనిచేయకపోవడంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రుబా అల్‌ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్‌ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్‌మెంట్‌కు చెబుదామన్నా కూడా ఇద్దరి మొబైల్స్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్‌ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు.

దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్‌ ఖాన్‌, అతని సహచరుడు అనుకున్నప్పటికీ.. ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్‌ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. 

సర్వీస్‌ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో వారి వాహనం పక్కనే విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

(చదవండి: వైద్యుడి రూపంలోని రాక్షసుడు)

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)