Breaking News

తెలంగాణ కల్చరల్ సొసైటీ 12వ సర్వ సభ్య సమావేశం

Published on Sun, 07/06/2025 - 16:24

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) / TCSS పన్నెండవ వార్షిక సర్వ సభ్య సమావేశం జూన్ 29వ తేదీన స్థానిక ఆర్య సమాజం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదకొండవ సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన తరువాత పద్దులను ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల  ఆమోదించారు. 

ఈ సమావేశం సందర్భంగా సభ్యులు ముద్దం విజ్జేందర్ , గర్రెపల్లి శ్రీనివాస్, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ  అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకట రమణ వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి మోడరేటర్‌గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల  వ్యవహరించారు.

2024‐2025 ఆర్థిక సంవత్సరానికి గానూ పద్దుల తనిఖీ దారులుగా సేవలు అందించిన కైలాసపు కిరణ్, తెల్లదేవరపల్లి కిషన్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ రాజ్యాంగానికి ప్రతిపాదించిన కొన్ని ముఖ్యమైన సవరణలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. 

2025 నుంచి 2026 గాను పద్దుల తనిఖీ దారులుగా నీలం సుఖేందర్, కిరణ్ కుమార్ ఎర్రబోయిన గార్లను ప్రతిపాదించి ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు సాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీ ని  ఆస్వాదించారు. 

ఈ సమావేశంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ  ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ గార్ల తోపాటు ఇతర జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)