Breaking News

‘మా అల్లుడు వెరీగుడ్’: సుధా మూర్తి

Published on Mon, 11/18/2024 - 08:50

తన అల్లుడు ఎంతో మంచివాడని, ఆయన్ని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉందని అంటున్నారు ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి. లండన్‌ విద్యాభవన్‌లో జరిగిన దీవాళి గళా కార్యక్రమంలో ఆమె భారతీయ విలువలు, సంస్కృతి మీద మాట్లాడుతూ..

మనిషికి మంచి చదువే కాదు.. సంప్రదాయ మూలాలు కూడా ముఖ్యమేనని అంటున్నారు సుధా మూర్తి. శనివారం లండన్‌లో జరిగిన ఓ కల్చరల్‌ ఈవెంట్‌లో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కూతురు అక్షతా మూర్తి, ఆమె భర్త..బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌లు హాజరయ్యారు.

మంచి విద్య మీకు పైకి ఎగరడానికి(ఎదగడానికి) రెక్కలను ఇస్తుంది, కానీ గొప్ప సంస్కృతి మిమ్మల్ని మీ మూలాల్లో నిలబెట్టేలా చేస్తుంది. ఉషా సునాక్‌(రిషి తల్లి) ఆయన్ని(రిషి) అద్భుతంగా పెంచారు. ఆ పెంపక పునాదుల్లో.. బలమైన భారతీయ సంస్కృతి ఉంది. సునాక్‌ బ్రిటిష్‌ జాతి గర్వించదగ్గ వ్యక్తి. అదే సమయంలో.. ఆయన భారతీయ వారసత్వంలో విలువలు కూడా కనిపిస్తాయి అంటూ అల్లుడిని ఆకాశానికెత్తారామె.

ఈ సందర్భంగా.. భారతీయ కళను, సంప్రదాయాన్ని పరిరక్షించేందుకు భారతీయ విద్యాభవన్‌ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. భారతీయ సంప్రదాయాల్ని నేర్చుకునేందుకు మీ పిల్లలను ఇక్కడికి(విద్యాభవన్‌)కు పంపండి. మనం ఒక వయసుకి వచ్చాక.. మన మూలాలను తాకాల్సి ఉంటుంది అంటూ ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి రిషి సునాక్‌ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్‌లు సైతం హాజరయ్యారు. విద్యాభవన్‌ నిర్వాహకులకు రిషి, అక్షతలు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్‌ స్వరాజ్‌ పాల్‌,

అంతకు ముందు.. భవన్‌ యూకే చైర్మన్‌ సుభాను సక్సేనా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఎన్‌ నందకుమారలు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే.. భారత కళలను ఎలా ప్రదర్శిస్తున్న తీరును, ఆ సెంటర్‌ సాధించిన విజయాల్ని ఏవీ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్‌ హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి.. రామాయణం, కలిపూజ వంటి అంశాలను ప్రస్తావించారు. పలువురు కళాకారులు భారతీయ నృత్య కళలు ప్రదర్శించారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి