Breaking News

పెళ్లికి ఇండియాకు రావాల్సిన టెకీ గుండెపోటుతో

Published on Tue, 05/27/2025 - 12:47

తూర్పు గోదావరి జిల్లా: మరో మూడు వారాల్లో ఆ ఇంట వివాహ వేడుకలు జరగాల్సి ఉంది. ఆనంద డోలికల్లో తేలియాడాల్సిన బంధుగణమంతా.. ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. కాబోయే పెళ్లి కొడుకుగా రావాల్సిన కుమారుడు.. నిర్జీవంగా ఇంటికి చేరడంతో ఆ తల్లిదండ్రుల విషాదానికి అంతులేకుండా పోయింది. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న మామిడికుదురు గ్రామానికి చెందిన ఎండీ తురాబ్‌ అలీ(28) ఈ నెల 17న గుండెపోటుతో మరణించారు. 

వచ్చే నెల 15న అతని వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లలో కుటుంబ సభ్యులుండగా, ఈ విషాద వార్త ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వాస్తవానికి తురాబ్‌ అలీ సోమవారం ఇంటికి రావాల్సి ఉంది. యాదృచ్చికంగా అదే రోజు అతని మృతదేహం ఇంటికి చేరిన సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. అతని తండ్రి రిజ్వానుల్‌ హసన్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, తురాబ్‌ అలీ పెద్దవాడు. తురాబ్‌ అలీ తాతయ్య తురాబ్‌ హుస్సేన్‌ ఓ స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన పేరునే తురాబ్‌ అలీకి తల్లిదండ్రులు పెట్టారు. 

పెళ్లి ఏర్పాట్లలో.. 
మరికొద్ది రోజుల్లో తురాబ్‌ అలీ వివాహం జరగాల్సి ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కల్యాణ మంటపం బుక్‌ చేసి, పెళ్లికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. బంధుమిత్రులకు శుభలేఖలు పంచడంలో బిజీగా ఉన్నారు. ఈలోగా తురాబ్‌ అలీ మరణవార్త చేరడంతో.. పెళ్లింట కాస్తా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు నడుమ మామిడికుదురు ఖబర్‌స్థాన్‌లో తురాబ్‌ అలీ అంత్యక్రియలు జరిగాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)