షార్జా, సౌదీలో వైఎస్సార్‌కు ఘన నివాళి

Published on Thu, 09/04/2025 - 14:28

సింహాద్రిపురం/కడప కార్పొరేషన్‌: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్‌ జిలాన్‌ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.

అనంతరం వైఎస్సార్‌ అభిమాని జిలాన్‌ బాషా మాట్లాడుతూ వైఎస్సార్‌ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్‌ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్‌ చౌదరి, అక్రమ్‌ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్‌ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్‌ రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్‌ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సౌదీ అరేబియాలో...
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్‌ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్‌ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల  వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.

చ‌ద‌వండి: విదేశాల్లో వైఎస్సార్‌కు ఘ‌న నివాళులు 

ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్‌, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్‌ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్‌ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)