Breaking News

జగనన్న సంక్షేమంపై స్పెషల్‌ కాంటెస్ట్‌

Published on Mon, 03/18/2024 - 13:41

సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోటీని ఔత్సాహిక ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ఎన్నారైలు శరత్‌ ఎత్తపు, తిరుమల్‌ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆన్‌లైన్‌ పోటీని APNRTS చైర్మన్‌ వెంకట్‌ మేడపాటి ప్రారంభించి మాట్లాడారు. సీఎం జగన్‌ పాలనలో లబ్ధిదారులు పొందిన లబ్ధి గురించి అభిప్రాయాన్ని వీడియో రూపంలో చేసి అందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. https://memusaitham.in/ లింక్‌ ద్వారా రిజిస్టర్‌ అయి, వీడియోలను షేర్‌ చేయాలని కోరారు.

ఎలా చేయొచ్చు అంటే.?

  • ఏపీలో సంక్షేమపథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి?
  • ఆర్ధిక, మౌలిక వసతుల రంగాల్లో ఏపీకి పునర్జీవనం వచ్చిందా ?
  • ప్రజల బతుకుల్లో జగనన్న ప్రభుత్వం నింపిన వెలుగులపై ఏమనుకుంటున్నారు?
  • మీ ఫోన్‌ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాన్ని వీడియో తీయండి, కింద పేర్కొన్న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయండి
  • బెస్ట్‌ వీడియోకు తగిన గుర్తింపుతోపాటు నగదు పురస్కారం
  • https://memusaitham.in/ లింక్‌ ద్వారా రిజిస్టర్‌ అయి, వీడియోలను షేర్‌ చేయండి

ఆసక్తి ఉన్న వారు "మేము సైతం" కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాష్‌ బహుమతులు గెలవచ్చన్నారు. వీడియోలను అనుభవజ్ఞులైన బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని, మొత్తం రూ.25 లక్షల నగదు బహుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రూ. 25,000, రెండో బహుమతి కింద రూ.15,000, మూడో బహుమతి కింద రూ.10,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5,000, రెండో బహుమతి కింద రూ.3,000, మూడో బహుమతి కింద రూ.2,000 ఇవ్వనున్నట్లు శరత్‌ చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)