Breaking News

పరమశివ తత్వాన్ని కలిగించేలా శివ మూర్తుల వైభవం

Published on Wed, 06/07/2023 - 18:17

అధునాతన సాంకేతికతకు ఆలవాలమైన సిలికాన్ లోయ, (USA)మహాదేవుని పదవిన్యాసపు ఆనంద అనుభూతిలో ఓ సాయంకాలం సేదదీరిన వైనం.. సనాతన ధర్మాన్ని సనూతనంగా నిలుపుకుంటూన్న భారతీయ బంధువులు ధర్మ సంపదను వారసత్వంగా ముందుతరాలకు అందిస్తున్న విన్యాసం.. సామవేద సారమంతా వెల్లువయ్యి, శివపద మంజీరాల నాదధారలుగా పొంగి చైతన్యపు స్రవంతులు పశ్చిమ పర్వతసానువులను పులకింపచేసిన అద్భుతం..

బుడిబుడి నడకల బుజ్జాయిలు సైతం పరమశివ తత్వాన్ని కలిగించేలా  గత ఆదివారం అమెరికాలో శాన్ హొసె (కాలిఫోర్నియా)లో  నిర్వహించిన   సామవేదం షణ్ముఖశర్మ విరచిత  శివపదం సంకీర్తనలు “శివ మూర్తుల వైభవం”  విశేషంగా నిలిచాయి.

వాణి గుండ్లాపల్లి నిర్వహణలో 12 మంది గురువులు కూచిపూడి, భరతనాట్య, మోహినీ ఆట్టం, కథక్, ఒడిసి రీతులన్నీ అలవోకగా మేళవిస్తూ సమ్మోహనపరచాయి. గురువులు: గురు బిదిషా మొహంతీ (ఒడిసీ) గురు నైన శాస్త్రి (భరతనాట్యం) గురు పెండేకంటి సునీత (కూచిపూడి)  రాజేష్ చావలి (కూచిపూడి) చందన వేటూరి (కూచిపూడి, భరతనాట్యాలు) గురు భైరవి నెడుంగడి (మోహిని ఆట్టమ్) గురు గణేశ్ వాసుదేవన్ (భరత నాట్యం) అఖిలరావు (భరతనాట్యం) గురు దీపాన్విత సేన్ గుప్త (కథక్) సీమ చక్రబర్తి గురు సుప్రియ సుధాకర్,  నూతి ప్రసూన (కూచిపూడి )  శిష్యబ్రుందంతో ఒక సరికొత్త  సాంప్రదాయంగా రూపొందింది.

భారత ప్రభుత్వ కన్సులేట్ జనరల్ (శాన్ ఫ్రాన్సిస్కో) డాక్టర్ T.V. నాగేంద్ర ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే - "షణ్ముఖ శర్మ గారి గీతాలకు నృత్య రూపం ఇచ్చిన ఈ కళాకారులు ఈ Bay Area ను శివమయం   చేశారు. అద్భుతంగా అలరించింది. ఇప్పుడిక్కడ ఉద్యోగాలున్నాయి.. భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ మన ఇండియాలోనే అంటే షణ్ముఖ శర్మకి  ఆయన పాదాభివందనం చేశారు. కంబోడియాలోని ఖ్మేర్ తమిళ సంఘం ప్రతినిధి డాక్టర్ రామేశ్వరాన్ని, ప్రదర్శించిన గీతాలకు పెయింటింగ్సు వేసిన దెందుకూరి రఘునాథుని కూడా సత్కరించారు. కాలిఫోర్నియా ప్రభుత్వ ప్రతినిధి Assemblyman Josh Hoover పంపిన అభినందన పత్రాన్ని నాగేంద్ర ప్రసాద్ బహూకరించారు.

#

Tags : 1

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?