తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్‌కు కొత్త కార్యవర్గం ఎన్నిక

Published on Tue, 12/30/2025 - 16:04

కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF - CANADA) రానున్న రెండేళ్ల కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జితేందర్ రెడ్డి గార్లపాటి అధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేయనున్నారు. 2026-27 రెండేళ్ల పాటు ఈ కొత్త కార్యవర్గం పనిచేయనుంది.

కొత్త కార్యవర్గంలో ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్‌గా అమిత పినికేశి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ కీస్రా, సంయుక్త కార్యదర్శిగా అనికేత్ రెడ్డి శామీర్ పేట, ట్రెజరర్‌గా కృష్ణా రెడ్డి చాడ, జాయింట్ ట్రెజరర్‌గా రవీందర్ రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌గా అర్షద్ ఘోరి, కమిటీ చైర్మన్లుగా బిజినెస్ కౌన్సిల్ చైర్ పర్సన్‌గా ఇందు రెడ్డి,  స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్‌గా  కె. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెనడా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్రం ఏర్పటయ్యాక కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రతీ ఏటా తెలంగాణ నైట్‌ను నిర్వహిస్తూ అక్కడి తెలుగువారిని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండగతో పాటు వివిధ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కెనడాలో స్థిరపడిన వందలాది మంది తెలుగువారు తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. 

అవసరమైన అన్ని సమయాల్లో సమాజ సేవ కార్యక్రమాలను కూడా విసృతంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ క్లబ్‌లో వందలాది మంది తెలుగు విద్యార్థులు భాగస్వామ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య కోసం వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ సంస్థ తగిన సహాయం అందిస్తోంది.

(చదవండి: విజయవంతంగా 'TTA సేవా డేస్‌–2025' వేడుక‌లు)

#

Tags : 1

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)