Breaking News

ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు

Published on Fri, 11/01/2024 - 13:39

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్‌లైన్ వేదికగా ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ మహిళా సాధికారత జాతీయ సమన్వయకర్త రాజలక్ష్మి  చిలుకూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది. ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలి.? ఆర్ధిక అంశాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.? 

ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించే మార్గాలు ఏమిటి.? ఇలాంటి ఎన్నో అంశాలను ఆ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. వర్జీనియాకు చెందిన ఆర్థిక నిపుణులు శ్రీలత గూడూరు, ఆదాయాలు ఎలా పెంచుకోవాలి., అప్పులు, ఆదాయ వనరులు, రిటైర్‌మెంట్ ప్లానింగ్, బేసిక్ మనీ మేనేజ్‌మెంట్ వంటి వివిధ అంశాలపై సవివరంగా ఈ సదస్సులో వివరించారు. నెట్‌లా సంస్థ వైస్ ప్రెసిడెంట్ మార్క్ స్టిర్నెమాన్  వీలునామాలు, ట్రస్ట్‌ల యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఇక్కడ డాక్యుమెంటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలిపారు.

 సదస్సులో పాల్గొన్న వారి ఆర్ధిక సందేహాలను  నివృత్తి చేశారు. ఈ సదస్సుకు శ్రీనివాస్ చిలుకూరి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఆర్ధిక అవగాహన సదస్సును విజయవంతం చేయడంలో కృషి చేసిన నాట్స్ వెబ్, మార్కెటింగ్ బృందాలు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రాజేష్ కాండ్రుతో లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం సభ్యులందరికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సదస్సుకు సహకరించిన నాట్స్  చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్‌ మదన్ పాములపాటికి నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

(చదవండి: నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు