అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
NRI ఐయోవాలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు
Published on Fri, 06/27/2025 - 16:43
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఐయోవాలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. ఐయోవాలోని హియావత పబ్లిక్ లైబ్రరీలో ఐయోవా నాట్స్ విభాగం నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో తెలుగువారికి ఎన్నో కీలకమైన ఆర్థిక అంశాలను నిపుణులు వివరించారు. స్థానిక ఆర్థిక నిపుణులు కుజల్ హార్వానీ, మధు బుదాటి, తరుణ్ మండవలు ఈ సదస్సులో ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పన్ను ప్రణాళిక, వీలునామాలు, కళాశాల ప్రణాళిక, ట్రస్ట్ అండ్ విల్ లాంటి కీలకమైన ఆర్థిక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా నిపుణులు వివరించారు. స్థానిక తెలుగు వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆర్థిక సందేహాలను నివృత్తి చేశారు. ఈ ఆర్థిక అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు నాట్స్ ఐయోవా విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
Tags : 1