Breaking News

వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఎస్‌ఏలో రక్తదానం

Published on Thu, 09/14/2023 - 17:05

దివంగత మహానేత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి(సెప్టెంబర్‌2) సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సీర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్‌ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు, వైస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 14వ వర్ధంతి పాటు అమెరికాలో  9/11  విషాదకర ఘటనను తలచుకుంటూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినట్లు ఫౌండేషన్‌ సభ్యులు తెలిపారు.

ప్రతి ఏడాది బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్  క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఇక ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు టీ షర్ట్ లు అందజేశారు. కాగా 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై  ఆల్‌ఖైదా ఉగ్రవాదులు దాడి చేశారు. 9/11 Attack ఘటన జరిగి 22 ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. 


 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)