Breaking News

యూరప్‌లో వైభవంగా మలయప్ప స్వామి కల్యాణం

Published on Wed, 10/04/2023 - 04:31

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్, యూకేలో మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్రాంక్‌ఫర్ట్, ఉట్రేచ్‌్ట–నెదర్లాండ్స్‌లో టీటీడీ అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు హాజరై భక్తి పారవశ్యంతో పులకించారు.

ఈ సందర్భంగా ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ మేడపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి సమన్వయంతో ప్రపంచంలోని తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల సహకారంతో శ్రీవారి కల్యాణాలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు.

కల్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. యూరప్‌లో స్వామి వారి కల్యాణానికి శివరామ్‌ తడిగొట్ల, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కార్తీక్‌ యార్లగడ్డ, జి.వెంకట కృష్ణ, సూర్య ప్రకాష్‌ తదితరులు ఏర్పాట్లు చేశారని వివరించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)