Breaking News

అమెరికాలో దాడి.. విషమంగానే ఖమ్మం యువకుడి పరిస్థితి

Published on Thu, 11/02/2023 - 13:40

చికాగో: అమెరికా చికాగోలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గత మూడు రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌ మీదనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి దృష్యా వరుణ్‌ని ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్‌ చికాగోలో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. ఈ నెల 29న జిమ్‌ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్‌ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల  సమాచారంతో పోలీసులు వచ్చి  ఆస్ప త్రికి తరలించారు. 

ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్‌ జోర్డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ రాజ్‌పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందామని వాల్పరైసో విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా అన్నారు. అటు వరుణ్ చికిత్స ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) గో ఫండ్‌ మీ(GoFundme)లో నిధుల సమీకరణను ప్రారంభించింది. బుధవారం రాత్రికి 38,000 డాలర్లకు పైగా సమీకరించింది.

అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివర్ధన్‌ ఫోన్‌ చేసి వరుణ్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు. 

ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్‌.. ఫోన్, కెమెరా దొంగతనం

Videos

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!