భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!

Published on Mon, 05/13/2024 - 11:15

న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ అత్యవసర సేవల కోసం ఏడాది పొడవున తెరచి ఉంటుందని  పేర్కొంది. ఇది ప్రజల అత్యవసర అవసరాలను పరిష్కరించడానికి వారాంతాల్లో, ఇతర సెలవులతో సహా ఏడాది పొడవునా తెరిచే ఉంటుందని భారత కాన్సులేట్‌ ప్రకటించింది. మే 10 నుంచి అమలులోకి వచ్చే అన్ని సెలవు దినాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంటుందని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా న్యూయార్క్‌ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

ఈ మేరకు మే 10, 2024 నుంచి సాధారణ ప్రజల అత్యవసర అవసరాలను తీర్చేందుకు అన్ని సెలవు దినాల్లో(శనివారం/ఆదివారం ఇతర ప్రభుత్వ సెలవు దినాలతో సహా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాన్సులేట్‌ తెరిచి ఉంటుందని ప్రకటనలో వెల్లడించింది. ఈ సదుపాయం నిజమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కోసం అని, సాదారణ కాన్సులర్‌ సేవల కోసం కాదని తెలిపింది. అలాగే ఏదైనా అత్యవసర సేవ కోసం కాన్సులేట్‌కు వచ్చే ముందు అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌: 1-917-815-7066కు కాల్‌ చేయాలని భారతీయ కాన్సులేట్‌ దరఖాస్తుదారులకు సూచించింది. 

ఈ సేవలు అవసరమైన డాక్యుమెంట్‌ల ఆవశక్యతకు సంబంధించి, అలాగే తదుపరి పని దినానికి వాయిదా వేయలేని అత్యవసర పనులు., వంటి వాటికి  వర్తిస్తాయి. ముఖ్యంగా అత్యవసర వీసా, ఎమర్జెన్సీ సర్టిఫికేట్‌(అదే రోజు భారతదేశానికి ప్రయాణించడం కోసం) అదే రోజు పంపబడే మృతదేహాలను రవాణా చేయడం వంటి ప్రయాణ పత్రాల అత్యవసర అవసరాల కోసం మాత్రమే. దరఖాస్తుదారు నుంచి అత్యవసర సేవా రుసుము వసూలు చేయడం జరుగుతుంది. అత్యవసర వీసా సేవలు కూడా ఉన్నట్లు కాన్సులేట్ జనరల్ పేర్కొంది.

 

 (చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం)
 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)