Breaking News

ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published on Wed, 01/31/2024 - 14:53

భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఘనంగా జరిగాయి. టెంపుల్ టెర్రేస్ నగరంలో భారతీయులు ఈ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్- మాట, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్‌ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు అంబరాన్నంటాయి. మాట, నాట్స్‌తో పాటు పలు తెలుగు సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇక భారతీయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు.

ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని, ప్రసంగించారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇండియన్ రిపబ్లిక్ థీమ్ తో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ అలరించారు.ఇక జాతీయ జెండాలను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు.

చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఇక భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురిని మెమెంటోలతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుడ్ మరియు వెండర్ స్టాల్స్‌కి విశేష స్పందన వచ్చింది. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌కు సహాయసహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: డాలస్ లో ఘనంగా 75 వ గణతంత్ర వేడుకలు!)

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)