Breaking News

లవ్‌ ప్రపోజల్‌ తిర​‍స్కరించిన ఇండియన్‌ టెకీకి బాస్‌ చుక్కలు : నెటిజన్లు ఏమన్నారంటే

Published on Mon, 07/21/2025 - 11:26

పనిప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే మహిళలపై వేధింపులకు నిదర్శనం ఈ ఘటన.   కావాలనే జీతాలు పెంచకపోవడం, ప్రమోషన్లు నిరాకరించడం, జీతం ఆలస్యంగా ఇవ్వడం  ఇలాంటివి సాధారణంగా కొంతమంది ఉద్యోగులెదుర్కొనే వేధింపులు. దీనికి అదనంగా మహిళలు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి  వస్తుంది. తన వేధింపుల పర్వంపై ఇండియన్‌ టెకీ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టింది.

10 మంది ఉద్యోగులతో కూడిన ఒక చిన్న యూరోపియన్‌ టెక్‌ కంపెనీ అది. అలాంటి కంపెనీలో భారతీయ టెక్  రిమోట్‌గా పనిచేస్తోంది.  అయితే ఆమెకు వివాహితుడైన మేనేజర్ ఒక అభ్యంతరకర ప్రపోజల్‌ పెట్టాడు. దీన్ని ఆమె అంగీకరించలేదు. అంతే అతగాడి వేధింపులు మొదలైనాయి. బాస్‌ ఇన్‌డైరెక్ట్‌గా పెట్టిన  ప్రేమ ప్రతిపాదన తిరస్కరించిన తర్వాత తనను వృత్తిపరంగా లక్ష్యంగా చేసుకోవడం మొదలు పెట్టాడని రెడ్డిట్‌లో ఆరోపగించింది.  చీటికి మాటికి కోపగించుకోవడం,  పురుష సహోద్యోగులతో మాట్లాడుతున్నా కూడా సహించేవాడు కాదు. వృత్తిపరంగా, జీతాల జాప్యం, ఆమె చేయని తప్పులకు బహిరంగంగా మందలింపులు లాంటివి కూడా ఎదుర్కొన్నానని తెలిపింది.  తన ప్రతీ పనినీ, ప్రతీ కదలికను ప్రశ్నించడం, అవమానించడం, అతనికి పరిపాటిగా మారిపోయిందని వాపోయింది. ఎన్ని రకాలుగా టార్చర్‌ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాడు. గతంలో, రెండు రోజులు సెలవు అడిగినా ఇచ్చేవాడని,  దీనికి తన పనితీరు, టాలెంటే కారణమని భావించాను కానీ, దాని వెనుకున్న అతని దుర్బుద్ధి ఇపుడు అర్థమవుతోందని తెలిపింది. ఇంత జరుగుతున్నా, ఈ ఉద్యోగాన్ని వదల్లేను. ఎందుకంటే..రిమోట్‌గా వర్క్‌ చేసుకోడానికి అవకాశం ఉంది.ఈ సమయంలో తన కుటుంబానికితన అవసరం చాలా ఉంది. కానీ  ఈ వేధింపులో భరించలేనిదిగా మారుతున్నాయి.  ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ గొప్పగా లేదు, కాబట్టి మారడం కష్టం అని ఆమె పేర్కొంది.

దీనిపై  నెటిజన్లు చాలా మంది ఆమెకు సంఘీభావం తెలుపుతూ,  కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం మారితేనే మంచిది. ఎందుకంటే ఎవరికి కంప్లయింట్‌ చేసినా.  పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు Prevention of Sexual Harassment (POSH) కేసు పనిచేస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే HRలు కంపెనీల కోసం పనిచేస్తాయి  తప్ప ఉద్యోగుల కోసం కాదు. కాబట్టి వీలైతే ఉద్యోగం మారిపోండి అని మరికొందరు సలహా ఇచ్చారు.

‘‘నీ పని నువ్వు చూస్కో.. అనవసర మెసేజ్‌లు జోలికి పోకు. మరో ఉద్యోగం దొరికేవరకు జాగ్రత్తగా ఉండు’’ అని ఒకరు, ‘‘మున్ముందు  పరిస్థితి మరింత టాక్సిక్‌గా మారుతుంది.  మీ మెంటల్‌ హెల్త్‌ను కాపాడుకోండి’’ అని  ఒకరు, ఇది చేదు నిజం.ఉద్యోగం మారడం ఒక్కటే  ఆప్షన్‌ మరొకరు సూచించారు.  మొత్తానికి ఆమె పోస్ట్ కార్యాలయంలో వేధింపుల గురించి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. చాలామంది  మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని , సురక్షితమైన  ఆఫీసు వాతావరణాన్ని కోరుకోవాలని సూచించారు.  

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)