Breaking News

మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

Published on Wed, 01/01/2025 - 15:59

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది.  క్యూలో నిలబడమని  చెప్పినందుకు  సింగపూర్‌లోని ఒక  కేఫ్‌లోని కేఫ్‌లోని క్యాషియర్‌పై (Cafe Cashier) దాడి చేశాడు.  ఘటనలో భారత సంతతికి చెందిన రిషి డేవిడ్ రమేష్ నంద్వానీ (Rishi David Ramesh Nandwani ) దోషిగా  తేలాడు. దీంతో  సింగపూర్ కోర్ట్( Singapore Court ) నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4000 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.

సింగపూర్‌లోని హాలండ్ విలేజ్‌లోని ప్రాజెక్ట్ అకాయ్ కేఫ్‌లొ అక్టోబర్ 31న  ఈ ఘటన జరిగింది.   కేఫేలో ఫుడ్‌ ఆర్డర్‌ చేయడానికి వచ్చాడు రిషి. దాదాపు మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో   అక్కడంతా పిల్లలతో సహా కస్టమర్‌లు కిక్కిరిసి ఉన్నారు.  ఈ  సమయంలో క్యూలో తప్పుగా నిలబడటం గమనించిన మహిళా క్యాషియర్,  రిషీని వెనక్కి వెళ్లమని సూచించింది. దీంతో అతను వెళ్లలేదు సరికదా అసహనంతో రెచ్చిపోయాడు.   ఆ దేశం, అక్కడి ప్రజల గురించి అభ్యంతరకరంగా వ్యాఖానించాడు.  ఆమెపై దుర్భాషలాడాడుతూ, అసభ్యమైన పదజాలంతో దూషించాడు.  ఆవేశంతో కౌంటర్‌లో ఉన్న టిప్ బాక్స్ తీసుకుని ఆమెపైకి విసిరాడు. దీంతో ఆమె పైఅధికారులకు ఫిర్యాదు  చేసింది. దీంతో పోలీసులు రెండుగంటల్లోనే రిషిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిషీ దురుసుగా ప్రవర్తించినట్లు  తేల్చారు.

వీడియో లింక్ ద్వారా రిషిని కోర్టులో హాజరుపరిచారు.  కేఫ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా క్యాషియర్‌కు అసభ్యకరమైన సైగలు, దూషణలు చేస్తూ  ఉన్న వీడియోను కోర్టులో ప్లే చేశారు.  కేఫ్‌లో బాధితురాలి భద్రతకు హాని కలిగించే అవమానకరమైన పదాలను ఉపయోగించడం , అసభ్యకరమైన చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఛానల్ న్యూస్ ఆసియా ప్రకారం, శిక్ష సమయంలో రెండు అదనపు ఛార్జీలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.  అనంతరం డిసెంబరు 30  జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌