Breaking News

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ టెక్కీ దుర్మరణం

Published on Thu, 05/18/2023 - 11:41

ఫ్లోరిడా: అమెరికాలో సోమవారం (మే 15) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని తాంపాలో పాదచారుల క్రాస్‌ వద్ద రోడ్డు దాటుతున్న మరియప్పన్‌ సుబ్రమణియన్‌ (32)ను ఓ కారు రెడ్‌ సిగ్నల్‌ను జంప్‌ చేసి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

మరియప్పన్‌ లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం.. ఆయన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో టెస్ట్‌ లీడ్‌గా పనిచేస్తున్నారు. మరియప్పన్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వీరు భారత్‌లో ఉంటున్నారు. కాగా మరియప్పన్‌ ఈ మధ్యనే జాక్సన్‌విల్లే నుంచి తాంపాకు వచ్చారు.

మరియప్పన్‌ కుటుంబానికి సహాయం అందించేందుకు ‘గో ఫండ్‌ మీ’ అనే పేజీ ద్వారా ఫండ్‌ రైజింగ్‌ చేపట్టారు. అలాగే తాంపా, జాక్సన్‌విల్లే ప్రాంతాల్లోని కమ్యూనిటీ గ్రూప్‌ సభ్యులు మరియప్పన్‌ మృత దేహాన్ని భారత్‌లోని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఐ లహరి మృతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)