Breaking News

గ్రేటర్‌ అట్లాంటా తెలుగు సంఘం ఉగాది వేడుకలు!

Published on Fri, 04/19/2024 - 12:08

గ్రేటర్‌ అట్లాంటా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ SplashBI వారి సహాయ సహకారంతో, ఏప్రిల్‌ 13న డేశానా మిడిల​ స్కూల్‌(Desana Middle School)లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు 1800 మందికి పైగా విచ్చేశారు. తెలుగు వారి సాంప్రదాయా పద్ధతిలో గణనాథుని ఆరాధన, జ్యోతి ప్రజ్వలన శ్రీకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోరూరించే షడ్రుచుల ఉగాది పచ్చడి..వినోదాత్మక రీతిలో యాంకరింగ్‌ చేసిన లావణ్య గూడూరు, లక్మీ మండవల్లిల అల్లరి ముచ్చటలతో మునగితేలారు. 

ఈ ఈవెంట్‌లో దాదాపు 200 మంది చిన్నారుల ఆట పాటల సందడి, అతిధుల సాంప్రదాయ వస్త్రదారణ, విభిన్న కళా ‍ ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఫుడ్‌ స్పాన్సర్లు ప్రశాంత్‌, బిర్యాని హౌస్‌ మహేష్‌ స్టాప్‌ ఈట్‌ రిపీట్‌( Stop Eat Repeat) వారు నోరూరించే కమ్మని వంటకాలను అదించారు. ఈ కార్యక్రమంలో దుర్గ ‍ మ్యూజికల్‌ కన్సర్ట్‌తో అఖిల్‌ అందించిన డీజే మ్యూజిక్‌ దద్ధరిల్లగా, అందులో అద్భతమైన గాయని అంజనా సౌమ్యా తన గాన మాదుర్యంలో ఆహుతలను రంజిప చేసింది.

అంతేగాదు ఈ వేడుకల్లో పెద్దా, చిన్నా, పిల్లలు చిందులేసి సంతోషంగా గడిపారు. చివరిగా శ్రీరాములోరి రథం తరలిరావడం, అక్షింతలు, ప్రసాదాలు, ఆశీర్వాదాలు అక్కడున్న వారందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. ఇక గాటా ఈసీ బోర్డు(Gata EC బోర్డు) సభ్యులకు సహకారులకు, సంస్థ శ్రేయోభిలాషులకు, విశిష్ట అతిథులకు, విచ్చేసిన అతిథులందరికీ పేరుపేరునా కృతజ‍్క్షతలు తెలియజేశారు గాటా ప్రెసిడెంట్ స్వప్న కస్వా. 

(చదవండి: అమెరికలో కలవర పెడుతున్న భారత విద్యార్థుల మరణాలు..ఎఫ్‌ఐడీఎస్‌ సీరియస్‌!)

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)