Breaking News

యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!

Published on Mon, 10/09/2023 - 11:42

గాన గంధర్వులు, దివగంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తృతీయ వర్ధంతి పురస్కరించుకుని  భగవాన్ బోయినపల్లి గారి ఆధ్వర్యంలో Bhagavan’s Soulful presents 'SPB Lives On' పేరుతో అక్టోబర్‌ 7, 2023 తేదీన సంస్మరణ సంగీత కార్యకమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం యూకేలోని లండన్‌లో నోవర్‌ హిల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. ఇదే కార్యక్రమం 2022లో భగవాన్‌ 'సోల్‌ఫుల్‌ ప్రెజెంట్‌' పేరుతో నిర్వహించిన ‘ట్రిబ్యూట్‌ టు ది లెజెండ్‌'  కార్యక్రమం ఘన విజయం సాధించింది.

అదే స్ఫూర్తితో ఎస్పీబీ గారి స్మృతికి చిహ్నంగా ఇలా ప్రతి యేటా నివాళులర్పించాలనే ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా విచ్చేశారు. ఈ సంగీత కార్యక్రమం భగవాన్ బోయినపల్లి గారీ ఉపన్యాసంతో మొదలైంది. తొలుత భగవాన్ గారు గాన గంధర్వని కీర్తిని ప్రశంసిస్తూ సంగీతాన్ని ప్రారంభించగా, చిన్నారులు భరతనాట్యంతో ఆ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు.  

ఈ కార్యక్రమంలో బహుముఖ గాయనీ గాయకులు నాలుగు గంటలకు పైగా బాలు గారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాడిన సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు.  ఈ సంగీత కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేసిన గాయనీగాయకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. దసరా పంగుడ ముందే వచ్చిందా అన్నంత రీతీలో వైభవంగా జరగడమే గాక అతిథుల విందు భోజనాలతో కుటుంబ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భగవాన్‌ బోయన్‌పల్లి గారిని అభినందించగా, మరికొందరూ ఇలా ప్రతి ఏటా నిర్వహించాలన్నా ఆయన సంకల్పాన్ని వేన్నోళ్ల  కొనియాడారు. 

(చదవండి: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌ సారా! చివరికి సుప్రీం కోర్టు..)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)