Breaking News

హైదరాబాద్‌లో గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభం

Published on Sun, 12/29/2024 - 14:34

అమెరికాతో పాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అందిస్తోన్న గెహిస్ ఇమ్మిగ్రేషన్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్.. నూతన బ్రాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సంస్థ ప్రిన్సిపల్, ఫౌండర్  నరేష్ ఎం గెహి, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్,మోడల్ అండ్ సోషలైట్ సుధా జైన్ , తదితరులు ముఖ్యతిథులుగా హాజ‌రయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వల‌న చేసి.. గెహిస్ లీగల్ సర్వీసెస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.  

భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలోని నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటు చేసినట్లు   ఎన్.ఎం గెహి తెలిపారు.  అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారికి ఎదురయ్యే ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అక్కడ నివసిస్తూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డ వారికి తమ సంస్థ సేవలు అందిస్తుందని వివరించారు.

భారత్‌, అమెరికా మధ్య అంతరాన్ని తగ్గించే ఈ ప్రయాణం గేహిస్ ఇమ్మిగ్రేషన్‌కు ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఆవిష్కరణలు, అవకాశాలు అమెరికాకు అందించడంలో భారతదేశం ఎపుడు అగ్రగామిగా ఉంటుంద‌న్నారు. ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ న్యాయ సేవ‌ల‌ కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ  నేపథ్యంలో అవసరమైనా వారికి అందుబాటులో ఉండటానికి మరిన్ని ప్రదేశాలలో సేవ‌లు అందించ‌డానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా నరేష్ ఎం గెహి పేర్కొన్నారు.

గెహిస్  లీగల్ సర్వీసెస్ ముంబాయి తర్వాత రెండవ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని అద్దంకి దయాకర్ అన్నారు. తెలుగువారు అత్యధికంగా అమెరికాలో నివసిస్తున్నారని, అలాంటివారికి అక్కడ తలెత్తే సమస్యలకు సరైన సలహాలు అందిస్తూ పరిష్కారాల కోసం పనిచేస్తున్న గెహిస్ సంస్థ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

(చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్‌మ్యాన్‌)

 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)