Breaking News

అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా తెలుగు విద్యార్థి

Published on Fri, 05/31/2024 - 18:12

అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్‌ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థుల హవానే కొనసాగింది. ఈ ఏడాది జరిగిన 96వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో ఏడుగురు ఫైనలిస్టులను ఓడించి విజేతగా నిలిచాడు భారత సంతతి విద్యార్థి బృహత్‌ సోమ. కేవలం 90 సెకన్లలో అబ్సెయిల్‌ సహా 29 పదాలను అలవోకగా తప్పుల్లేకుండా చెప్పి..కప్‌ తోపాటు 50 వేల డాల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నాడు. 

ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల బృహత్‌ సోమ ప్రస్తుతం ఏడో గ్రేడ్‌ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్‌ సోమ నల్గొండకు చెందినవారు. ఈ ఏడాది స్పెల్లింగ్‌ బీ పోటీల్లో దాదాపు 240 మందికి పైగా పాల్గొన్నారు. అందులో ఏడుగురు గురువారం రాత్రికి ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక వారిలో బృహత్‌ సోమకి, టెక్సాస్‌కు చెందిన పైజాన్‌ జాకీ మధ్య టై ఏర్పడింది. దీంతో ఇద్దరికీ మరో రౌండ్‌ పోటీ నిర్వహించి 90 సెకన్ల సమయాన్ని కేటాయించారు నిర్వాహకులు. ఈ పోటీలో జాకీ 90 సెకన్లలో 20 పదాలు చెప్పగా, బృహత్‌ ఏకంగా 29 పదాలు చెప్పి టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. 

2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్‌ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును బృహత్‌ బ్రేక్‌ చేశాడని నిర్వాహకులు తెలిపారు. అంతేగాదు బృహత్ గతంలో 2022లో స్పెల్లింగ్ బీలో 163వ స్థానానికి చేరురోగా, 2023లో 74వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.  కానీ ఈ ఏడాది మాత్రం బృహత్  టైటిల్‌తో సత్తా చాటాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాకీ 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీని అందుకున్నాడు. ఇక ఈ పోటీల్లో శ్రేయ్‌  పరీఖ్‌ రెండోవ  స్థానంలో నిలవగా, అనన్య రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అమెరికా ఈ స్పెల్లింగ్‌ బీ పోటీలను 1925 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోటీల్లో 29 మంది భారత సంతతి విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. 

(చదవండి: US: పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!)
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)