Breaking News

పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు

Published on Wed, 06/18/2025 - 17:11

డల్లాస్:   భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు.
 
నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుకబడిన దేశాల్లో వేల మంది చిన్నారుల ఆకలి తీర్చడంలో దోహదపడనుంది. మానవ సేవే మాధవ సేవ అనే నాట్స్ చేపట్టే  అనేక కార్యక్రమాల్లో ఉంటుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి  కార్యక్రమాల్లో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచుతాయని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని, సమిష్టి శక్తిని చూపించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలే  మంచి ఉదాహరణలు అని నాట్స్ బోర్డ్ డైరెక్టర్  రాజేంద్ర మాదాల అన్నారు. 
 
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన  పావని నున్న, సౌజన్య రావెళ్ల డల్లాస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ నాయకత్వం అభినందించింది.  అలాగే స్పాన్సర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులతో పాటు 20 కి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు.  సమాజంలో సేవా స్ఫూర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు