Breaking News

బర్లిన్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక

Published on Thu, 09/25/2025 - 14:46

బర్లిన్, 21 సెప్టెంబర్ 2025 – బర్లిన్ హాసెన్‌హైడేలోని శ్రీ గణేశ ఆలయం రంగురంగుల పూలు, సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో అలంకరించబడింది. తెలంగాణా అసోసియేషన్ జర్మనీ (TAG) e.V., స్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చాలిగంటి నాయకత్వంలో 12వసారి బతుకమ్మ ఉత్సవం ఘనంగా జరిగింది.

ప్రధాన అతిథిగా భారత రాయబార కార్యాలయం (బర్లిన్) మంత్రి (పర్సనల్) డాక్టర్ మంధీప్ సింగ్ తులీ హాజరై బతుకమ్మను తలపై మోసి పూజల్లో పాల్గొన్నారు. జర్మనీలోని అనేక భారతీయ సంఘాల అధ్యక్షులు కూడా వేడుకను శుభాకాంక్షలతో అభినందించారు.

300 మందికి పైగా తెలుగు మహిళలు, కుటుంబ సభ్యులు బర్లిన్ , పరిసర ప్రాంతాల నుండి చేరి బతుకమ్మలను పేర్చారు. బొడ్డెమ్మ పూజ, గౌరి పూజలు నిర్వహించిన తరువాత, సాంప్రదాయ తెలుగు వంటకాలతో విందు చేశారు.  సాంప్రదాయం, వినోదం కలిసిన కార్యక్రమంలో నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్స్, తంబోలా వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.

వేడుక విజయవంతం కావడంలో TAG సభ్యులు – వెంకట రమణ బోయినిపల్లి, అలేఖ్య భోగ, శరత్ రెడ్డి కమిడి, బాలరాజ్ ఆండే, అవినాష్ పోతుమంచి, శ్రీనాథ్ రమణి, నరేష్ తౌటమ్, నటేష్ చెట్టి, అమూల్య బొమ్మరబోయిన – కీలకపాత్ర పోషించారు. అంతేకాక, అనేక మంది వాలంటీర్లు ఉత్సాహభరితంగా సహకరించారు.

బతుకమ్మ లాంటి  వేడుకలు సంప్రదాయాన్ని నిలబెట్టి, సమాజ బంధాలను మరింత బలపరిస్తాయని, ఇలాంటి  కార్యక్రమాలకు ప్రవాస తెలుగు సమాజానికి TAG ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్వాకులు ప్రకటించారు.  TAG ఈ సమాజాన్ని ఒక యూనిట్‌గా బలంగా నిలబెట్టేలా నిరంతరం కృషి చేస్తుందన్నారు నవ్వులు, స్నేహం, ఆత్మీయతలతో ముగిసిన ఈ ఉత్సవంలో, బర్లిన్‌లోని తెలుగు సమాజం తెలంగాణా సంస్కృతి, ఆత్మ, ఐక్యతను ఘనంగా ప్రతిబింబించింది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)