Breaking News

టెక్సాస్‌లో ఘనంగా దసరా అలయ్‌ బలయ్‌.. పాల్గొన్న ప్రవాసులు

Published on Sat, 11/11/2023 - 12:10

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - 'మాట'(Mana America Telugu Association) డల్లాస్ చాప్టర్  దసరా అలయ్ బలయ్  వేడుకలను ఘనంగా నిర్వహించింది.  టెక్సాస్‌లోని డ్రీమ్ డెస్టినేషన్ రాంచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో  3000 మందికి పైగా ప్రవాసులు పాల్గొని సందడి చేశారు. 'మాట' టీమ్ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఈ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన రావణ దహనం కార్యక్రమాన్నిఅట్టహాసంగా నిర్వహించారు.  ప్రవాసుల కేరింతల నడుమ  రావణ దిష్టిబొమ్మ దహనం చేశారు.  

మాట సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, బిజెపి నాయకులు ప్రదీప్ రవికాంత్ ముఖ్య అతిథిలుగా విచ్చేసి, ప్రసంగించారు. 'మాట' డల్లాస్ చాప్టర్ రాజ్ సారథ్యంలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, సన్మానించారు. డప్పు వాయిద్యాలు,  కోలాటాలు, నృత్యాలతో.. అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు.

 మహిళలు ఆటా పాటలు, కోలాటాలతో సందడి చేశారు. మగవారు డప్పులతో డాన్సులు చేస్తూ.. ఆకట్టుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా పలు సాంస్కృతిక  కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, స్పూర్తి తమ గాత్రంతో పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైనా ప్రతిఒక్కరికీ పసందైనా విందు భోజనం అందించారు.  

ఇక ఈ వేడుకలు విజయవంతం అవడం పట్ల 'మాట' డల్లాస్ చాప్టర్ సభ్యులు ఆనందం  వ్యక్తం చేశారు.  సేవా, సంస్కృతి, సమానత్వం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థను స్థాపించడం జరిగిందని సంస్థ సభ్యులు వివరించారు.  ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాట సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ  కృతజ్ఞతలు  తెలిపారు. ఇక ప్రవాసుల ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి.
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)