Breaking News

డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

Published on Thu, 07/18/2024 - 17:07

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైయస్ఆర్ 75వ జయంతి వేడుకలు న్యూ జెర్సీ, మన్రో లోని థాంప్సన్ పార్కులో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు.  300 మందికి పైగా వైఎస్సార్ అభిమానులు  పాల్గొని నివాళులర్పించారు.

డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్  ఆధ్వర్యం లో వైస్సార్ ను స్మరించుకుంటూ  చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి  వివరించారు.  గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 కి పైగా ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయం లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బాగ్స్,  కంప్యూటర్ లాబ్స్, మెడికల్ కిట్స్ , ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు.. దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం అని  డాక్టర్ రాఘవ రెడ్డి గోసల పేర్కొన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్ ఉపయోగించుకొని ఎంతోమంది ఈ రోజు అమెరికా లో వున్నారు అంటే.. రాజశేఖర రెడ్డి  ముందుచూపే కారణం అని రాజేశ్వర్ రెడ్డి గంగసాని తెలిపారు.  నదులను అనుసంధానం చేయడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీకాంత్ కోరారు.

భానోజీ రెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, రమణా రెడ్డి తో పాటు పలువురు వక్తలు  వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలసి ఇలా ఒకేచోట చేరి.. వనభోజనాలతో వైఎస్సార్ జయంతి నిర్వహించటం..  ఆయన ప్రజల గుండెల్లో వున్నాడు అనటానికి చిహ్నం అని తెలియజేశారు.  ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి గోపిరెడ్డి, నాగి రెడ్డి , రామమోహన్ రెడ్డి, భానోజీ రెడ్డి,  విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ .. పేరు పేరున కృతజ్ఞతలు తెలిపింది.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)