Breaking News

న్యుజెర్సీలో గ్రాండ్‌గా మాటా క్యారమ్‌ ఛాంపియన్‌షిప్ 2024

Published on Sat, 10/05/2024 - 11:54

అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాటా క్యారమ్‌ ఛాంపియన్‌షిప్ పోటీలు విజయవంతంగా ముగిసాయి. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ‘మాటా’ అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఫస్ట్ టైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా క్యారం బోర్డు.. ఈ పోటీలను నిర్వహించటం విశేషం.

పండితుల వేద మంత్రోచ్ఛారణల మ‌ధ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్యారమ్‌ పోటీల్లో మొత్తం 40 జట్లు పాల్గొని సత్తా చాటాయి. జాతీయస్థాయి క్రీడాకారులూ పాల్గొని తమ ప్రతిభను చాటారు.  ప్రతి జట్టు కేవలం డబుల్స్‌లోనే పాల్గొనగా, ప్రథమ బహుమతిగా 1,116 డాలర్లు, రెండో బహుమతిగా 516 డాలర్లు, మూడవ స్థానం గెలుచుకున్న వారికి ట్రోఫీ అందజేసి.. సత్కరించారు. 



ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని గ్రాండ్ స్పాన్సర్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈవో, ప్రెసిడెంట్ రఘు వీరమల్లు అన్నారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆదిత్య లోధా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ సెనేటర్ పాట్ డిగ్నాన్, అసెంబ్లీమన్ స్టెర్లే స్టాన్లీ, మిడిల్‌సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్, ఎడిసన్ కౌన్సిలర్ అజయ్ పాటిల్, డా. ఉపేంద్ర చివుకులా, చీఫ్ కంప్లేన్స్ ఆఫీసర్ ఉదయ్ కులకర్ణి, తదితరులు హజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ పోటీ నిర్వహణకు మాటా స్పోర్ట్స్ కో-ఆర్డినేట‌ర్ సురేష్ బాబు కజానా ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించి విజ‌య‌వంతం కావడంలో కీల‌క పాత్ర వ‌హించారు. మాటా వ్యవస్థాపకులు, అధ్యక్షులు శ్రీనివాస్ గనగొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకు, క్రీడాకారుల‌కు మాటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మాటా సంస్థ తరుపున చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా  వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)