Breaking News

ఛారిటీ కోసం ఇంగ్లిష్‌ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!

Published on Wed, 09/11/2024 - 11:59

చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించేందుకు ఇంగ్లిష్‌‌ ఛానెల్‌ని ఈదింది 16 ఏళ్ల భాతర సంతతి విద్యార్థి ప్రిషా తాప్రే. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఉత్తర లండన్‌లోని బుషే మీడ్స్‌ స్కూల్‌లో చదువుతున్న ప్రిషా తాప్రే 12 ఏళ్ల వయసులో ఈ ఇంగ్లీష్‌ ఛానెల్‌ గురించి తెలసుకుని ఈదాలనే ఆసక్తిని పెంచుకున్నట్లు తెలిపింది. 

అందుకోసం నాలుగేళ్ల కఠిన శిక్షణ అనంతరం గత వారమే ప్రిషా ఇంగ్లాండ్‌లోని డోవర్‌ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్‌ గ్రిస్‌నెజ్‌ వరకు దాదాపు 34 కిలోమీటర్ల ఈతని 11 గంటల 48 నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రిషా ఈ లక్ష్యాన్ని సోలోగా పూర్తి చేయడం విశేషం. ప్రిషా యూకేలోనే జన్మించగా, ఆమె తల్లిందండ్రులు మహారాష్ట్రాకు చెందినవారు. 

ఆమె యూకేకి చెందిన అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ(పిల్లల ఆకలిని తీర్చే సంస్థ) కోసం దాదాపు రూ. 4 లక్షలు సేకరించింది. ఈ స్వచ్ఛంద సంస్థనే ప్రిషా ఎంచుకోవడానికి కారణం ఇది ఇంగ్లండ్‌​, భారతదేశంలోని పిల్లలకు సహాయపడుతుండటమేని ఆమె చెబుతోంది. 

(చదవండి: అమెరికా విస్కాన్సిన్‌ స్టేట్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్‌ ఉత్సవాలు)
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)