అమెరికాలో అంగరంగ వైభవంగా బోనాల జాతర

Published on Tue, 07/22/2025 - 10:35

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ సంప్రదాయ బోనాల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రేటర్ న్యూయార్క్, న్యూజెర్సీ చుట్టుపక్కల స్థిరపడిన వందలాది తెలుగు ప్రవాస కుటుంబాలు ఒక్కచోట చేరి బోనాల జాతరను జరుపుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ పండగ అమెరికాలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటింది.  

ఇటు తెలంగాణలో ఆషాడ బోనాల  సందడి మొదలుకాగానే, అటు అమెరికాలో ప్రవాసులు కూడా జాతర ఉత్సవాలకు సిద్దమయ్యారు.  న్యూయార్క్‌లో  స్థానిక ఐసన్ హోవర్ పార్కులో ఘనంగా బోనాల జాతర జరిగింది. ఆడపడుచులు, అమ్మాయిలు సంప్రదాయ దుస్తులతో స్వయంగా బోనాలను తయారుచేసి దేవతలకు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో మరింత అభివృద్ధి దిశగా పయనించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ప్రార్ధించారు. తెలంగాణ జానపద కళాకారులు జంగిరెడ్డి, దండుపల్లి శ్రీనివాస్ ల ఆటపాటలు నైటా బోనాలకు మరింత ఉత్సాహాన్ని నింపాయి, వాటి ఆటపాటలతో వేడుకల ప్రాంతం దద్దరిల్లింది. అలాగే అశోక్ చింతకుంట పోతురాజు వేషం వేయగా, వీరితో పాటు ఆహుతులు అందరూ కలిసి ఆడిపాడారు. ఆటపాటలతో పాటు చిన్నారులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు నైటా ఆధ్వర్యంలో అందించారు. అలాగే ఆహుతులందరికీ తెలంగాణ స్టయిల్లో పసందైన బోనాల విందును  నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ వడ్డించింది.

న్యూయార్క్ మహానగరంలో నివసిస్తూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను నిలుపుకుంటున్న తెలుగు కుటుంబాలకు నైటా అధ్యక్షురాలు వాణి ఏనుగు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో పాటు, ప్రముఖ ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, వివిధ ఈవెంట్లను స్పాన్సర్ చేసిన సంస్థలు, వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)