Breaking News

సింగపూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం!

Published on Mon, 10/23/2023 - 11:33

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరం. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్లో అక్టోబర్ 21 న ఎంతో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 3 వేల నుంచి 4 వేల వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్లో నివసిస్తున్న తెలుగు వారందరు స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలా విశేష ఆదరణ కలుగజేసినందుకు టీసీఎస్‌ఎస్‌ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు.

ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు సౌజన్య డేకోర్ వారు బహుమతులు అందజేశారు. వీరితో పాటు సింగా దాండియా వారు లక్కీ డ్రాలో 10 మంది అదృష్ట విజేతలకు చీరలు అందజేయడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరం అని సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు టీసీఎస్‌ఎస్‌ సభ్యులు. టీసీఎస్‌ఎస్‌ ప్రేరణతో ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందినీయం అని అన్నారు.

ఈ ఏడు బతుకమ్మ సంబురాలకు టీసీఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణ గ నిలిచింది. ఈ సారి యూట్యూబ్‌లో విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట వేల వీక్షణాలతో దూసుకుపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి  కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్  కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల, గోనె రజిత, కాసర్ల వందన, రాధికా రెడ్డి నల్ల, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్యమాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు మొదలగు వారు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సారి వేడుకలను సొసైటీ ఫేస్ బుక్ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది.

(చదవండి: సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)