Breaking News

గ్లాస్గోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం

Published on Mon, 09/22/2025 - 11:51

తెలంగాణకు ప్రత్యేకమైన మరియు ఆడపడుచుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నివసించే తెలుగువారు ఘనంగా ప్రారంభించారు. నిన్నటితో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డా. మమతా వుసికల,వినీల బతులా ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో అనేక మహిళలు పాల్గొని పువ్వులతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తయారుచేశారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేశారు. బతుకమ్మ పాటలకు గుంపులుగా చిందులేసి ఉత్సాహంగా నర్తించి ఆధ్యాత్మికతతో కూడిన ఉత్సవాలను జరుపుకున్నారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాక, విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి ఐక్యతకు, వారి భాషా-బాషా సంస్కృతులకు నిదర్శనంగా నిలిచింది.

ఈ ఉత్సవానికి మదర్ ఎర్త్ హిందూ టెంపుల్ గ్లాస్గో అధ్యక్షులు డా. పునీత్ బేడి, ఉపాధ్యక్షురాలు డా. మమతా వుసికల ముఖ్య నాయకత్వం వహించారు. వారు వచ్చే వారంలో మరింత విస్తృతంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులతో, సాంస్కృతిక ప్రదర్శనలతో, సంప్రదాయ తెలంగాణ వంటకాలతో ఆ వేడుకలు మరింత ప్రత్యేకంగా ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ విధంగా గ్లాస్గో నగరంలో బతుకమ్మ పండుగ ఆరంభం ప్రవాసాంధ్రులు, ప్రవాసతెలంగాణ వాసుల్లో ఆనందం కలిగించిందని, తమ పుట్టిన గడ్డ సంస్కృతిని పరిరక్షించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇది ఒక గొప్ప ముందడుగని హాజరైన వారు పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)