Breaking News

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆటా ప్రతినిధుల ఆహ్వానం!

Published on Sun, 04/07/2024 - 09:56

ఆటా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆటా కన్వెన్షన్‌ ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూన్‌ 7, 8, 9 తేదీలలో అమెరికాలోని  అట్లాంటాలో ఆటా తెలుగు కన్వెన్షన్ భారీ ఎత్తున​ జరగనుంది. ఈ వేడుకలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం ఆటా ప్రతినిధులు ఆటా తెలుగు కన్వెన్షన్‌ అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. అందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అమెరికాలో వున్న తెలుగు వాళ్ళను కలవడానికి తప్పకుండా వస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కో ఆర్డినేటర్ వశిష్ఠ్ రెడ్డి తదితరులు వున్నారు.

కాగా, ఆటా సంస్థ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం అందించారు. ఇలాగే గతేడాది ఆటా కన్వెన్షన్‌ డిసెంబర్ నెలలో 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేసిన విషయం విదితమే.

(చదవండి: సింగపూర్‌లో తమిళ వైభవం..ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)