Breaking News

ఆటా, ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌

Published on Wed, 11/05/2025 - 12:17

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA)  అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.  యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో  ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్‌కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ  ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను  ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు.  డీన్ , ప్రొఫెసర్ అరోరా..  విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు.   విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై  మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు.   హెల్త్‌ మరియు లైఫ్‌ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి,  ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో  చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.

అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు.  యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్‌ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్‌షిప్స్‌ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే  కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై  ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో  ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్  పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు  నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.  భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)