Breaking News

దివ్యాంగులకు హోఫ్4 స్పందన చేయూత

Published on Wed, 11/27/2024 - 16:10

దివ్యాంగులకు అండగా నిలవాలనే సంకల్పంతో కృషి చేస్తున్న అమెరికాలోని హోఫ్4స్పందన సేవా సంస్థ తెలుగునాట వేల మంది వికలాంగులకు సాయం అందిస్తుంది. ఈ క్రమంలోనే అనంతపురంలోని కాటగానికాలువ గ్రామంలో ఆశ్రయ అనాధశ్రమానికి హోఫ్4 స్పందన అండగా నిలిచింది. ఈ ఆశ్రమంలో అనాధ మానసిక వికలాంగులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కావాల్సిన ఆర్ధిక సహకారాన్ని అందించింది. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఏకాంశ సంస్థలు ఈ సత్కార్యానికి సాయం చేశాయి. 

హోఫ్4 స్పందన నిర్వాహకులు లక్ష్మీ నరసింహం కోట తాజాగా అనంతపురంలోని ఆశ్రయ అనాధశ్రమం కోసం నిర్మిస్తున్న శాశ్వత షెల్టర్‌ను పరిశీలించారు. దాదాపు 70 శాతం పూర్తయిన ఈ షెల్టర్ అనాధ మానసిక వికలాంగులకు ఆవాసంగా మారనుంది. సమాజ సేవ కోసం హోఫ్4 స్పందన పిలుపుతో స్పందించి సాయం చేసిన నాట్స్, ఏకాంశ సంస్థలకు లక్ష్మీ నరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటితో పాటు హోఫ్4 స్పందన ఆశయ సిద్ధికి అండగా నిలిచిన నాట్స్ నాయకులు శ్రీధర్ అప్పసాని, మురళీకృష్ణ మేడిచెర్ల లకు ధన్యవాదాలు తెలిపారు. 25 ఏళ్లుగా అనాధ మానసిక వికలాంగుల కోసం ఆశ్రయ అనాధశ్రమం ద్వారా కృషి చేస్తున్న కృష్ణారెడ్డి సేవలు అభినందనీయమని లక్ష్మీ నరసింహ అన్నారు. వందమందికిపైగా మానసిక వికలాంగులకు ఈ కొత్త షెల్టర్ ఉపయోగపడనుంది.

(చదవండి: ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)