Breaking News

ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా చారిత్రక ఒప్పందం

Published on Mon, 09/29/2025 - 16:22

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association) ఆటా..  ఐఐటీ హైదరాబాద్‌తో చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇంజనీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణలలో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌ తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అవగాహన ఒప్పందం కుదిరింది. విద్యార్థుల గ్లోబల్ ఇంటర్న్‌షిప్ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం జరిగింది.

వాషింగ్టన్ డీసీలో  జరిగిన కార్యక్రమంలో  ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా,ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొన్ని వారాల నుండి ఒక సంవత్సరం వరకు ఐఐటీలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.

తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్  క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.

ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఇన్నోవేషన్‌లలో అనుభవం పొందే మార్గాలు ఏర్పడతాయని జయంత్ చల్లా పేర్కొన్నారు. టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడంలో యువతకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.  తొలిసారిగా భారతదేశం వెలుపల ఐఐటీ ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి. IITH అర్హులైన విద్యార్థులకు వసతి ఇతర సదుపాయాలు నామమాత్రపు ఫీజుతో కల్పిస్తుందన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు