Breaking News

అద్భుతం.. అదిత్రి అరంగేట్రం

Published on Mon, 06/22/2026 - 11:51

హైదరాబాద్‌: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్‌ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్‌ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య  అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది. గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదికపై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర..చివరగా థిల్లానాతో ముగిసింది. 

అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్‌ సిటిజన్స్‌ కాగా..వారి కూతురు అదిత్రి  లా అండ్‌ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు. నగరంలో ఉండే తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్‌రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్‌లు ఆనందం వ్యక్తం చేశారు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)