Breaking News

అడిలైడ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Published on Sun, 10/22/2023 - 17:48

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిలైడ్‌ నగరంలోని ఎల్డర్ పార్క్ లో ఉన్న ఆడిలైడ్ ఫెస్టివల్ సెంటర్లో ఈ వేడుకల్ని జరిపారు.  సౌత్‌ ఆస్ట్రేలియా పార్లమెంట్‌ హౌస్‌లో తొలిసారి నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. వీరిలో పలువురు ఆస్ట్రేలియన్లు కూడా  పాల్గొన్నారు. ప్రధానంగా ఈ వేడుకల్లో పాల్గొన్న ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు తెలంగాణ సంప్రదాయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుని మరీ ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఎల్డర్‌ పార్క్‌లో ఈ వేడుకల్ని నిర్వహించిన తర్వాత టోరెన్స్‌ నదిలో వీడ్కోలు పలికారు. ఈ వేడుకల్లో టోరెన్స్‌ ఎంపీ వొర్టీ, సాంస్కృతిక శాఖా మంత్రి జోబెట్టిసన్‌ హాజరయ్యారు. ఎల్డర్‌ పార్కులో ఈ వేడుకల్ని తెలంగాణ సంప్రదాయబద్ధంగా నిర్వహించి టోరెన్స్‌ నదిలో సాగనంపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా టోరెన్స్‌ ఎంపీ డానా వొర్ట్లీ,  సాంస్కృతిక శాఖ మంత్రి  జో బెట్టిసన్‌  హాజరయ్యారు. 

అడిలైడ్‌ తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షురాలు హరితారెడ్డి బతుకమ్మ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. వైస్‌ ప్రెసిడెంట్‌ మమతా దేవా, ట్రెజరర్‌ ప్రత్యూష, సెక్రటరీ నిక్కిల్‌ మరియు కమిటీ సభ్యులు సౌజన్య, సృజనా రెడ్డి, అనిల్‌, ప్రశాంత్‌ రెడ్డి, చరిత్‌ రెడ్డిలు ఈ బతుకమ్మ సంబరాల్ని సక్సెస్‌గా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు.

శివగర్జన టీమ్‌లోని వాలంటీర్లైన స్టీఫెన్‌ వాట్స్‌, శ్రీనివాస్‌ వడ్లకొండ, సంజయ్‌ మెంగర్‌, తదితర వాలంటీర్లు ఈ వేడుక విజయవంతంగా జరగడానికి కృషి చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో చాలా మంది భారతీయులు కూడా పాల్గొని సందడి చేశారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)