Breaking News

WhatsApp: మల్టీ లాగిన్​, స్కాన్​ అవసరం లేకుండానే..

Published on Fri, 06/04/2021 - 09:41

శాన్​ఫ్రాన్సిస్కో: వాట్సాప్​ యూజర్లకు మరో గుడ్ న్యూస్​. స్మార్ట్​ ఫోన్​ అవసరం లేకుండా ఒకేసారి నాలుగు డివైజ్​లకు అకౌంట్ లాగిన్​ అయ్యి వాడుకునేలా ఫీచర్​ త్వరలో రాబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో​ విల్​ క్యాథ్​కార్ట్​​ ధృవీకరించారు. 

వ్యాబేటాఇన్ఫో ఇంటర్వ్యూలో విల్​ క్యాథ్​కార్ట్​​ మాట్లాడుతూ.. వాట్సాప్​ను ఒకేసారి నాలుగు డివైజ్​లలో లాగిన్​ అయ్యేలా ఫీచర్​ తేబోతున్నాం. ఈ సౌకర్యంతో ఐప్యాడ్​లో వాట్సాప్ లాగిన్​ అయ్యేందుకు వీలు ఉంటుంది(ఇంతవరకు ఆ సపోర్ట్ లేదు). ప్రస్తుతం వాట్సాప్​ వెబ్​, డెస్క్​టాప్​ యాప్​ కోసం స్మార్ట్ ఫోన్​తో లాగిన్​(స్కాన్​) చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మీదట మెయిన్​ యాప్​, స్మార్ట్​ ఫోన్ యాప్​​ సపోర్ట్ లేకుండా మల్టీ డివైజ్​ ఫీచర్​(లింక్​)తో లాగిన్​ కావొచ్చు అని ఆయన వివరించాడు. 

కాగా, ఈ విషయాన్ని మార్క్​ జుకర్​బర్గ్​ కూడా కన్ఫర్మ్​ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ప్రైవసీ సమస్యలున్నప్పటికీ దీన్నొక టెక్నికల్ ఛాలెంజ్​గా తీసుకున్నాం. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించాం. ఫోన్​ స్విచ్ఛాప్ అయినా కూడా మల్టీ డివైజ్ లాగిన్​ ద్వారా వాట్సాప్​ పని చేసేలా ఫీచర్​ పరిశీలనలో ఉంది అని జుకర్​బర్గ్ తెలిపాడు. అలాగే ‘వ్యూ వన్స్​’.. అవతలి యూజర్​ ఒకసారి ఫొటో, వీడియో చూడగానే దానంతట అదే మాయమయ్యే ఫీచర్​ కూడా ఫ్యూచర్ అప్​డేట్ పరిశీలనలో ఉందని గుర్తు చేశాడు. చదవండి: వాట్సాప్​పై ఆసక్తికర వ్యాఖ్యలు

Videos

ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

Photos

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)