Breaking News

డెలివరీ ఏజెంట్‌కు సర్‌ప్రైజ్‌

Published on Mon, 09/02/2024 - 05:53

బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్‌డే.. వేడుక ఏదైనా మనకు టైమ్‌కు ఫుడ్‌ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్‌. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్‌ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్‌ బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.

 నగరానికి చెందిన యశ్‌ షా జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌చేశాడు. ఆర్డర్‌ డీటెయిల్స్‌ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్‌ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్‌ అయిన షేక్‌ ఆకిబ్‌ బర్త్‌డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్‌ తన బర్త్‌డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నారు. ఆర్డర్‌తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్‌తో కలిసి ‘హ్యాపీ బర్త్‌ డే’ అంటూ విష్‌ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు.

 ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్‌ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన యశ్‌.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్, డెలివరీ ఏజెంట్‌ షేక్‌ ఆకిబ్‌ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు.                

– అహ్మదాబాద్‌

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)