Breaking News

ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ ఎంపీల మాక్‌ పోలింగ్‌

Published on Mon, 09/08/2025 - 14:35

సాక్షి,న్యూఢిల్లీ: వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఇప్పటికే ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.  

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగుతుండగా.. మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.రేపు ఉదయం పదిగంటలకు ప్రారంభమై.. ఐదుగంటల వరకు కొనసాగుతోంది. ఆరుగంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే, ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్లను అరికట్టేందుకు అన్నీ పార్టీల ఎంపీలు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో నిర్వహించిన మాక్‌ పోలింగ్‌ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. 


మాక్‌ పోలింగ్‌కు ముందే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ను పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు.  తమ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 11 మంది వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్‌కు సుబ్బారెడ్డి వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాధాకృష్ణన్‌. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది వైఎస్ జగన్ అభిమతమని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి వెల్లడించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)