Breaking News

‘మార్గదర్శి’ని ఎందుకు వదిలేశారు?

Published on Tue, 02/11/2025 - 05:41

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు. మార్గదర్శికి ఒక మీడి­యా సంస్థ ఉన్నందున విడిచిపెట్టాల్సిన అవసరమేంటన్నారు. సోమవారం లోక్‌సభలో 2025–26 కేంద్ర బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2,600 కోట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మార్గదర్శి, ఆర్బీ­ఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ నిధులను దారి మళ్లించిందన్నారు.

ఈ రకంగా నిధులు సేకరించ­డం తప్పని ఆర్‌బీఐ అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నా­రు. ఆదాయ పన్ను విభా­గం మార్గదర్శికి రూ.1000 కోట్ల జరిమానా విధించడ­ంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. లక్షలాది మంది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మార్గదర్శి కుంభకోణంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు విచా­రణ జరపట్లేదని ప్రశ్నించారు.

17 మెడికల్‌ కాలేజీల పనుల నిలిపివేశారు  
వచ్చే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్‌ సీట్లను అందుబాటులోకి తెస్తామని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమకు కేటాయించిన మెడికల్‌ సీట్లను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మెడికల్‌ కమిషన్‌ కు లేఖ రాశారని లోక్‌సభ దృష్టికి తెచ్చా­రు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌­­మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించారని, అయితే ఇప్పుడు ఆ  పనులన్నింటినీ ప్ర స్తుత ప్రభుత్వం ఆపేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి జోక్యం చేసుకుని  నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

⇒ మిథున్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ పురందేశ్వరి అడ్డుపడే ప్రయత్నం చేశారు.. పురందేశ్వరి భౌతికంగా బీజేపీ­లో ఉన్నా.. ఆమె మనస్సు మాత్రం టీడీపీలోనే ఉందని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని పురందేశ్వరి.. చంద్రబాబు గురించి మాట్లాడగానే స్పందిస్తున్నారని విమర్శించారు. 

⇒  బడ్జెట్‌లో పోలవరం ఎత్తు తగ్గించమని ఎవరు అడిగారంటూ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించడం వల్ల పోలవరం సామర్థ్యం తగ్గిపోతుందని.. జాతీయ ప్రాజెక్టుకు రావాల్సిన రూ.60 వేల కోట్లలో కేవలం రూ.30 వేల కోట్లు ఇస్తే, మిగతా రూ.30 వేల కోట్ల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. 

⇒  రైల్వేజోన్‌ను 10 ఏళ్ల తర్వాత ఇచ్చినా వాల్తేర్‌ డివిజన్‌ను రెండుగా విభజించి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా మొత్తం వాల్తేర్‌ డివిజన్‌ను కొత్త రైల్వే జోన్‌లోకి కలపాలని డిమాండ్‌ చేశారు.

⇒ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎ­స్సా­ర్‌సీపీ వ్యతిరేకిస్తోందని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)