Breaking News

చిరుత దవడలు సాగదీసి.. పంజాను తొక్కిపెట్టి..

Published on Tue, 03/10/2026 - 11:37

సోలన్: అతనికి ప్రాణసంకటం ఎదురైనప్పుడు సాహసం సాయపడింది. 12 నిమిషాల పాటు చిరుతతో సాగిన ఆ భీకర పోరాటంలో చివరకు మృగమే తలవంచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా అర్కి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అర్కి ఐటీఐ విద్యార్థి ప్రవేష్ శర్మ సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తమ పొలం గుండా పాలు తీసుకువచ్చేందుకు వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక చిరుతపులి ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడింది. ఊహించని ఈ పరిణామంతో నివ్వెరపోకుండా, తన ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రవేష్ అసాధారణ పోరాటం చేశాడు. ఒకటిన్నర ఏళ్ల వయసున్న ఆ చిరుత పులి పంజా విసురుతున్నా, తన చేతులతో దాని దవడలను గట్టిగా పట్టుకుని ప్రతిఘటించాడు.

సుమారు 12 నిమిషాల పాటు యువకుడికి ఆ క్రూర మృగానికి మధ్య భీకర పోరాటం సాగింది. చిరుత గోళ్ల గీతలతో శరీరం రక్తసిక్తమవుతున్నా ప్రవేష్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, చిరుత మెడను, తలను బలంగా అదిమి పట్టి మట్టుబెట్టాడు. ఆత్మరక్షణ కోసం సాగించిన ఈ పోరాటంలో చిరుత ప్రాణాలు కోల్పోగా, ప్రవేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై ప్రవేష్ బాబాయ్ శ్యామ్ లాల్ మాట్లాడుతూ.. మార్చి 6వ తేదీ నుంచే ఈ ప్రాంతంలో చిరుత సంచారం ఉందంటూ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని కోరినప్పటికీ, అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఘటనా స్థలాన్ని సందర్శించిన అటవీ శాఖ డివిజనల్ అధికారి రాజ్‌కుమార్ శర్మ, గాయపడిన ప్రవేష్‌కు తక్షణ సహాయంగా రూ. 5,000 అందజేశారు. వన్యప్రాణుల సహజ ఆవాసాలు దెబ్బతినడం వల్లే అవి జనావాసాల్లోకి వస్తున్నాయని ఆయన అన్నారు. సాధారణంగా చిరుతలు రాత్రి వేళల్లో దాడులు చేస్తాయని, అయితే ఈ చిరుత తెల్లవారుజామునే దాడికి దిగడం దాని ఆకలి తీవ్రతను సూచిస్తోందని వివరించారు. ప్రవేష్ శౌర్యసాహసాల గురించి తెలిసిన స్థానికులు, తోటి విద్యార్థులు, నెటిజనులు అతనిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ఇది కూడా చదవండి: ‘ఎన్‌సీఈఆర్‌టీ’ వివాదం: ‘న్యాయ పాఠం’పై కీలక నిర్ణయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)