Breaking News

ఆర్జీ కర్‌ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి!

Published on Sat, 09/07/2024 - 16:52

బెంగాల్ వైద్యురాలిపై హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర  దుమారం రేపుతున్న తరుణంలో.. ఘటన జరిగిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఓ యువకుడు మరణించాడు. అయితే  తన కొడుకు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతడి తల్లి ఆరోపిస్తోంది.

వివరాలు.. కోల్‌కతాకు 25 కి. మీ దూరంలో ఉన్నహుగ్లీలోని కొన్నాగర్‌లో 28 ఏళ్ల యువకుడు విక్రమ్‌ భట్టాచాజీ నివాసముంటున్నాడు. ఇటీవల అతడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఆర్‌జీకర్‌ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం బిక్రమ్‌ మరణించాడు. అయితే ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు అందుబాటులో లేరని, కొడుక్కి చికిత్స అందించడంలో ఆలస్యం చేయడం వల్లే మరణించినట్లు అతని తల్లి ఆరోపించింది.

ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్‌ అందుబాటులో లేరు. చాలా సమయం వృధా అయింది. ఆ లోపు అతని సర్జరీ పూర్తి కావాల్సి ఉంది. కనీసం అత్యవసర వైద్యుడు కూడా లేడు’ అని ఆమె వాపోయింది. అయితే, ఆర్‌జి కర్ ఆసుపత్రి అధికారులు మాత్రం మృతుడి కుటుంబ వాదనలను తోసిపుచ్చారు.  

శుక్రవారం ఉదయం విక్రమ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వెంటనే ట్రామా కేర్‌కు తీసుకెళ్లారని వైద్య సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సప్తర్షి ఛటర్జీ పేర్కొన్నారు. అతని శరీరంపై తలపై పెద్ద గాయం అయ్యిందని, సీటీ స్కాన్‌ కోసం తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే సీటీ స్కాన్  చేస్తున్నప్పుడు విక్రమ్ ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలిపాడు.

కాగా గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై ఆర్‌జీ కర్ హాస్పిటల్ వైద్యులు నిరంతరం నిరసనలు చేస్తున్న తరుణంలో.. ఈ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు