Breaking News

యువకుడిని ముక్కలుగా చేసి హత్య.. ఏడుగురికి మరణశిక్ష

Published on Fri, 11/29/2024 - 09:10

కోల్‌కతా:పశ్చిమబెంగాల్‌లో 2020లో యువకుడిని ముక్కలుముక్కలుగా చేసి హత్య చేసిన కేసులో ఏడుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇది అత్యంత క్రూరమైన రీతిలో జరిగన హత్య కావడం వల్లే నిందితులకు మరణశిక్ష విధిస్తున్నట్లు చిన్సూర సెషన్స్‌కోర్టు తెలిపింది. ఓ ముక్కోణపు ప్రేమకథలో బిష్ణుమాల్‌(23) అనే యువకుడిపై బిశాల్‌ అనే యువకుడు కోపం పెంచుకున్నాడు.

స్నేహితుల సహకారంతో బిష్ణును అతడి ఇంటివద్ద నుంచి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. ఓ ఇంట్లో బిష్ణు శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి హత్యచేశారు. బిష్ణుమాల్‌ను ముక్కలుగా చేసిన తతంగాన్ని మొత్తం నిందితులు వీడియో చిత్రీకరించారు. అనంతరం శరీరభాగాలను పలు ప్రాంతాల్లో పారవేశారు. ఈ కేసులో బిష్ణు ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న యువతి సాక్ష్యం కీలకంగా పనిచేసిందని ప్రాసిక్యూటర్‌ తెలిపారు.

బిష్ణు హత్యలో నేరుగా పాల్గొన్న ఏడుగురు నిందితులకు మరణశిక్ష పడగా నిందితులకు సహకరించిన మరొకరికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. కేసులో అందరు నిందితులను హత్యజరిగిన వెంటనే పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ప్రధాన నిందితుడు బిశాల్‌ మాత్రం నెల రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు.  బిశాల్‌ అరెస్టయిన తర్వాతే మృతుడి తల భాగాన్ని పోలీసులు రికవర్‌ చేయగలిగారు. తలను ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌ చేసి బిశాల్‌ తన ఇం‍ట్లో దాచుకోవడం అప్పట్లో సంచలనం రేపింది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)