Breaking News

స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్‌ మెషీన్‌లో వేలు పెట్టగానే..

Published on Mon, 08/21/2023 - 12:00

మధ్యప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో మరో అభ్యర్థి పేరుతో, అతని స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రత్లాంలోని ఒక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్‌ మెషీన్‌లో అభ్యర్థుల వేలి ముద్రల గుర్తింపులో సమస్య ఏర్పడటంతో వారికి కంటి రెటీనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇంతలో ఒక నకిలీ అభ్యర్థి బిల్డింగ్‌లోని మెదటి అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు. 

వివరాల్లోకి వెళితే రత్లాంకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని సాత్‌రూంఢాలో గల మారుతి స్కూలులో పోలీస్‌ కానిస్టేబుళ్ల రాతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్‌, ఆధార్‌ కార్డును అధికారులకు చూపిస్తేనే వారిని పరీక్షా హాలులోకి అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్‌(20) తన స్నేహితుడు, ఇటావానివాసి రాహుల్‌ యాదవ్‌ స్థానంలో పరీక్ష రాసేందుకు అతని హాల్‌ టిక్కెట్‌తో పరీక్షా కేంద్రానికి వచ్చాడు. 

అయితే బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ సమయంలో అధికారులకు అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించారు. దీంతో పుష్ఫేంద్ర యాదవ్‌ స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి, స్కూలు వెనుక తలుపు నుంచి పొలాల్లోకి పారిపోయాడు. అయితే అతనిని పోలీసులు వెంబడించి గ్రామ శివార్లలో పట్టుకున్నారు. అధికారులు ‍ప్రశ్నించినప్పుడు పుష్పేంద్ర యాదవ్‌.. రాహుల్‌ యాదవ్‌ తన స్నేహితుడని తెలిపాడు. డబ్బు కోసం ఆశపడి రాహుల్‌ స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చానని తెలిపాడు. దీంతో పోలీసులు రాహుల్‌ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
ఇది కూడా చదవండి: వింత మొఘల్‌ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి..

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)