Breaking News

విలేజ్‌ ఆఫీసర్‌ అరుణ పరువు హత్య?!

Published on Sat, 01/03/2026 - 11:38

తమిళనాడు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న క్రమంలో తన ప్రియురాలిని ఆమె తల్లిదండ్రులు  విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తూ ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి వద్ద కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా అగరం గ్రామానికి చెందిన రవి. ఇతని కుమార్తే అరుణ(27). 

ఈమె పొన్నేరి సమీపంలోని కీరపాక్కం వీఏఓ. అరుణకు తన సహచర వీఏఓ శివభారతి మూడేళ్లుగా సాగిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. కులాలు కావడంతో అరుణ ఇంట్లో వివాహానికి అంగీకరించలేదు. ఈక్రమంలో గత 29న అరుణ విషం సేవించి ఆత్మహత్యకు యత్నించిందని, ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు శివభారతికి సమాచారం అందింది. చికిత్స పొందుతూ అరుణ తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న శివభారతి, అరుణ మృతిలో అనుమానం వుందని ఆరోపిస్తూ తిరుపాళ్యవ నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

తమ పెళ్లికి అరుణ తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో పాటు గతంలో తనపై, అరుణపై దాడి చేశారని పోలీసులకు వివరించారు. విషం తాగి ఆత్మహత్యకు యత్నించి వైద్యశాలలో చికిత్స పొందుతున్న అరుణ, 30న రాత్రి తననూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంప్రదించానని, పెళ్లి విషయాన్ని ఇంట్లో చెప్పడంతో బలవంతంగా తన నోట్లో విషం పోసినట్టు తన వద్ద వాపోయిందని పోలీసులకు వివరించాడు. వారిపై చర్య లు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.    

Videos

బీసీలకు రిజర్వ్ చేసిన స్థానంలో OC మహిళ నామినేషన్ వేయడమేంటి?

కెప్టెన్సీ పోయాక రెచ్చిపోతున్న హర్మన్.. అసలు కారణం ఇదేనా

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ తులం ఎంతుందంటే..!

కాయాదుకు ప్లాపులతో పని లేదు... ఎందుకంటే..!

ఇప్పటికైనా మారకపోతే... మేము సృష్టించే విద్వంసానికి తట్టుకోవడం...!

5 జిల్లాలకు రెడ్ అలర్ట్... విశాఖ లో నెలకొరుగుతున్న చెట్లు

ప్రభాస్ ఫౌజీపై కొత్త చర్చ ఆ ఫిల్టర్ సిగరెట్లా ఎక్కడిది?

చేతకాని దద్దమ్మల చేతిలో పాలన ఉంది.. YS ప్రమీల స్పీచ్ కి జగన్ రియాక్షన్

చొక్కా మడతబెట్టా... ఎవడొస్తాడో రండి.. పులివెందులలో ఎవరిపై చెయ్యి పడినా...!

చంపినా భయపడేది లేదు.. ? జగన్ కోసం ప్రాణమిస్తా

Photos

+5

సింపుల్ లుక్.. కానీ మరింత అందంగా హెబ్బా (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో సాయిపల్లవి.. పవర్‌ఫుల్ ఐపీఎస్ పాత్రలో ఇలా (ఫొటోలు)

+5

'చంద్రయాన్' చిత్రం రాకెట్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

'సీన్' కోసం సీన్ సితార్ అనేలా నజ్రియా (ఫొటోలు)

+5

దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్.. ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం (ఫోటోలు)

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)