Breaking News

అయోధ్యలో వర్షం నీటి ఎఫెక్ట్‌.. సీఎం యోగి సీరియస్‌ యాక్షన్‌

Published on Sat, 06/29/2024 - 10:04

లక్నో: బీజేపీ, ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. అయితే, అయోధ్యలో మౌళిక సదుపాయాల విషయంలో స్థానికులు, భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలో పరిస్థితులను తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేశారు. అలాగే, అయోధ్యలో 14 కిలోమీటర్ల మేర గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలో మోకాళ్లలోతు నీటితో రోడ్లు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రామమందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు మునిగిపోయాయి. స్థానికులు మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు. వర్షం పడిన ప్రతిసారీ తమకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కూడా కష్టాలు పడుతున్నారని చెబుతున్నారు. వర్షం కారణంగా వీధులు పూర్తి బురదమయంగా ఉండడంతో బైకులు, ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేవని పేర్కొంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

మరోవైపు, అయోధ్యలో ఇటీవల కురిసిన వర్షానికి ఆలయంలో వర్షపు నీరు లీకేజీ అవుతున్నట్టు ఆలయ ప్రధాన పూజారి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పైకప్పు నుండి వర్షపు నీరు ఆలయం లోపలికి చేరుతోందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాటు కూడా లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ స్పందిస్తూ వర్షం నీరు వెళ్లేందుకు ఆలయంలో అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)