Breaking News

తెలుగులోనూ కుంభమేళా సమాచారం

Published on Sun, 01/12/2025 - 05:31

రోజూ సరాసరి కోటిమంది హాజరయ్యే అవకాశం ఉన్న మహా కుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్‌ యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో సైతం మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్‌ యాప్‌ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్‌లో 88878–47135 ఫోన్‌ నంబర్‌కు హెచ్‌ఐ (హాయ్‌) అని మెసేజ్‌ చేసి 11 భాషల్లో తమకు నచ్చిన బాషను ఎంపిక చేసుకుని ఆ తర్వాత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

 భక్తుని ఫోన్‌ నంబర్‌ ‘కుంభ్‌ సహాయక్‌ యాప్‌’ (kumbh sahayak app) ద్వారా భక్తులు తాము వెళ్లదలుచుకున్న పుష్కర ఘాట్‌లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్లాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్‌లో పొందుపరిచారు. యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య  భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం తమ ఫోన్‌ నంబర్‌ యాప్‌లో నమోదు చేయాల్సిన  అవసరం లేకుండానే యాప్‌ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)